వినాయకా.. సెలవిక
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:25 PM
మండల కేంద్రమైన రాజోలిలోని పెద్ద మసీదు నందు ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు ఆదివారం నిమర్జనానికి తరలినారు.
రాజోలి, సెప్టెంబరు 15 : మండల కేంద్రమైన రాజోలిలోని పెద్ద మసీదు నందు ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు ఆదివారం నిమర్జనానికి తరలినారు. వినాయక చవితిని పురష్కరించుకుని ప్రతిష్టించిన 14 అడుగుల భారీ విగ్రహాం మండలంలోనే అతి పెద్ద వినాయకుడిగా పేరుపొందారు. 9 రోజులు పూజలు అందుకుని ఆదివారం సాయంత్రం అగరంగవైభవంగా వినాయకుడి నిమర్జనం ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయకుడి అడ్డు వేలంపాట నిర్వహించగా రూ. 10వేలు పలికింది. వినాయకుడి రూపంలో ఏర్పాటు చేసిన 4 తులాల వెండి విగ్రహం కూడా రూ. 10,100/- పలికిందని నిర్వహకులు తెలిపారు. అనంతరం క్రేన్ సహాయంతో వినాయకుడిని ట్రాక్టర్‌లోకి ఎక్కించి, ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, గ్రామ శివారులో ఉన్న తుంగభద్ర నదిలో నిమర్జనం చేశారు. కార్యక్రమంలో వినాయక మండలప నిర్వాహకులు తిప్పన్న, వెంకటేష్, నాగరాజు, మధు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రూ.1.97లక్షలు పలికిన లడ్డూ
ఎర్రవల్లి, సెప్టెంబరు 15: తొమ్మిది రోజులపాటు నిత్యపూజలు చేసిన గణనాథులను భక్తులు ఆదివారం కృష్ణమ్మ ఒడికిచేర్చారు. ఆయా ఉత్సవ కమిటీలు, యూత్ సభ్యులు విగ్రహాలను గ్రామాల్లో ఘనంగా ఊరేగించి, బీచుపల్లి కృష్ణానదికి తరలించారు. నది వద్ద క్రేన్‌ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇటిక్యాల ఎస్‌ఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎర్రవల్లిలోని స్వామి వివేకానంద ఫ్రెండ్స్ యూత్ ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలంపాట పోటాపోటీగా జరిగింది. బాదం అశోక్ రూ.1.97లక్షలకు దక్కించుకున్నాడు.
ఉండవల్లి మండలంలో..
ఉండవల్లి, సెప్టెంబరు 15: మండల కేంద్రంతో పాటు కంచుపాడు, తక్కశీల, ప్రాగటూర్, మారమునగాల, బైరాపురం, బస్వాపురం తదితర గ్రామాలల్లో కొలువుదీరిన గణనాథులను ఆదివారం నిమజ్జనానికి తర లించారు. తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథు లకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఔత్సాహితులు ఆయా మండపాల దగ్గర నిర్వహించిన లడ్డూ వేలంపాటలో పాల్గొని లడ్డూ దక్కించుకున్నారు. ప్ర త్యేకంగా అలంకరించన వాహనాలలో గణనా థులను తరలించారు. ఉండవల్లి గాంధీనగర్, అన సూయమ్మ కాలనీ, వీఆర్ కాలనీ, ఊరువాకిలి దగ్గ ర, బస్టాండు కాలనీ, వివేకానంద కాలనీ, అయ్య ప్పస్వామి గుడి సమీ పంలో ఉన్న గణనాథుల నిమజ్జన శోభాయాత్రలో చిన్నారులు, యువ త సంబురాలు అంబరానంటాయి.
నిమజ్జనం సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాత్రి వరకు ఊరేగింపు చేసుకుంటూ కృష్ణ, తుంగభద్ర నదులలో నిమజ్జనం చేశారు.