విద్యార్థులు రాకే మూతపడింది
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:19 PM
పాఠశాలకు విద్యార్థులు రాకే మూతపడిందని ఎంఈవో నిజాముద్దీన్ అన్నారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
- మూతపడిన పాఠశాలలను పరిశీలించిన ఎంఈవో
కృష్ణ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు విద్యార్థులు రాకే మూతపడిందని ఎంఈవో నిజాముద్దీన్ అన్నారు. ‘మూ తపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మండలంలోని సుకూరులింగంపల్లి, అడవి ఖానాపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, మా ్లాడారు. త్వరలో గ్రామస్థులతో సమావేశం ఏర్పాటుచేస్తామని, రెండు గ్రామాల్లో గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఎంఈవో పే ర్కొన్నారు. కాగా, ఓవైపు ఉపాధ్యాయులు రాక పిల్లలు పాఠశాలలకు పంపించడం లేదని ఆయా గ్రామాల తల్లిదండ్రులు తెలుపగా, పిల్లలు రాకే ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపించామని ఎంఈవో పేర్కొనడం విశేషం.