క్రీడా హబ్‌గా తెలంగాణ
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:00 AM
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధా న్యం కల్పిస్తూ, బడ్జెట్‌లో క్రీడలకు రూ.364 కోట్ల కేటాయించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ, ఎండీసీఏ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి
రూ.65 లక్షల వ్యయంతో టార్ఫ్ వికెట్‌తో గ్రీన్‌గ్రాస్ గ్రౌండ్ పనులకు భూమిపూజ
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధా న్యం కల్పిస్తూ, బడ్జెట్‌లో క్రీడలకు రూ.364 కోట్ల కేటాయించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ, ఎండీసీఏ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం బోయపల్లి సమీపంలో గల ఎండీసీఏ మైదానంలో గ్రీన్‌గ్రాస్ టార్ఫ్ వికెట్ భూమిపూజ, మైదానంలో పలు అభివృద్ధి పనుల ను హెచ్‌సీఏ అఽధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, సె క్రటరీ దేవరాజ్, ట్రైజరర్ శ్రీనివాస్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడలకు పెద్దపీట వేశారన్నారు. మాస్టర్ ప్లాన్‌లో 10 ఎకరాల్లో స్టేడియం, అకాడమీలు ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. హెచ్‌సీఏ అఽధ్యక్షుడు జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ రూ.65లక్షలతో టార్ఫ్ వికెట్‌తో గ్రీన్‌గ్రాస్ గ్రౌండ్, ముఖద్వార నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారిగా ట్రార్ఫ్ వికెట్ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యతుల్లో రంజీ మ్యాచ్ నిర్వహించేలా ఎండీసీఏ మైదానం అభి వృద్ధి, అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలి పారు. త్వరలో రాష్ట్రస్థాయి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. అనంతరం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో సెక్రటరీ దేవరాజ్, ట్రైజరర్ శ్రీనివాస్‌రావు, ఉపా ఽఽధ్యక్షుడు దల్జీత్‌సింగ్, జాయింట్ సెక్రటరీ బస్వరా జ్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, చీఫ్ ప్యాట్రన్ మనోహర్‌రెడ్డి, సురేష్‌కుమార్, వెంకట రామరావు, చంద్రకుమార్‌గౌడ్, లక్ష్మకాంత్‌రావు, కృష్ణమూర్తి, నాయకలు బసిరెడ్డి, పాపరాయుడు, కౌన్సిలర్ మోతీలాల్, కోచ్‌లు అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.