Share News

విద్యార్థులు ఏదో ఒక క్రీడలో రాణించాలి

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:29 PM

విద్యార్థులు క్రీడల్లో క్రీడాస్ఫూర్తిని ప్రద ర్శించి రాణించాలని ఎస్‌ఆర్‌ విద్యాని కేతన్‌ డైరెక్టర్‌ కురువ రాము అన్నారు.

విద్యార్థులు ఏదో ఒక క్రీడలో రాణించాలి
అండర్‌-19 కబడ్డీ పోటీలో తలపడుతన్న హార్‌వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌, వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ జట్లు

- ఎస్‌ఆర్‌ విద్యానికేతన్‌ డైరెక్టర్‌ కురువ రాము

- రెండో రోజు కొనసాగిన సౌత్‌జోన్‌ కబడ్డీ పోటీలు

గద్వాల అర్బన్‌, సెప్టెంబరు 15 : విద్యార్థులు క్రీడల్లో క్రీడాస్ఫూర్తిని ప్రద ర్శించి రాణించాలని ఎస్‌ఆర్‌ విద్యాని కేతన్‌ డైరెక్టర్‌ కురువ రాము అన్నారు. పట్టణ శివారు ఎస్‌ఆర్‌ విద్యానికేతన్‌లో ఆదివారం రెండోరోజు సీబీఎస్‌ ఈ సౌత్‌జోన్‌ రాష్ర్టాల బాలుర కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, క్రీడాకారులను పరిచయం చేసు కుని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ప్రతిఒక్క విద్యార్థి క్రీడల పట్ల ఆస క్తిని పెంచుకుని ఏదోఒక క్రీడలో రాణి స్తూ జిల్లాకుపేరు ప్రఖ్యాతలు తేవాల న్నారు. ప్రతిఒక్కరూ ఏదో ఒక క్రీడలో రాణిస్తూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలని సూచించారు.

రెండో రోజు పోటీల వివరాలు

సౌత్‌జోన్‌ కబడ్డీ పోటీల్లో అండర్‌-14 విభాగంలో 12 మ్యాచులు, అండ ర్‌-17 విభాగంలో పది మ్యాచులు, అండర్‌-19 విభాగం నుంచి ఏడు మ్యాచు లు జరిగినట్లు ఎస్‌ఆర్‌ విద్యానికేతన్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ జోషి తెలిపారు. ఆది వారం రెండో రోజు మొదటి రౌంట్‌ పూర్తి అయ్యింద ని, మూడోరోజు సోమవా రం క్వార్టర్‌, సెమీఫైనల్‌ పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 11:29 PM