Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:05 PM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివా రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌.. చిత్రంలో ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు : ఎస్పీ

నారాయణపేట టౌన్‌, అక్టోబరు 1 : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివా రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లో ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌తో కలిసి రోడ్డు భద్రతపై సమీ క్ష నిర్వహించి కలెక్టర్‌ మాట్లాడారు. గతంలో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాల్లో ఏమేమి పురోగతి ఉందో తెలిపారు. సమావేశానికి సంబంధిత అధికారులు కాకుండా కిందిస్థాయి అధికారులను నామమా త్రంగా పంపిస్తే చర్యలు తప్పవన్నారు. నారాయణపేట - మక్తల్‌కు వెళ్లే రహదారి అత్యంత దయనీయమైన రోడ్డు అని, రాష్ట్రంలోనే అలాంటి రో డ్డు మరెక్కడా ఉండదేమోనని కలెక్టర్‌ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ మార్గం నుంచి అంబులెన్స్‌లు తీసుకరావొద్దని, ప్రత్యా మ్నాయ రోడ్డు ఎంపిక చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధి కారులను కలెక్టర్‌ ఆదేశించారు. అసలు ఎందుకు రోడ్డు మరమ్మతు చేయడం లేదన్నారు. ఇటీవలే ప్లడ్‌ డ్యామేజీ కింద మరమ్మతులకు రూ.14 కోట్లతో 26 కిలో మీటర్ల మేర మక్తల్‌ రోడ్డుకు ప్రతిపాదనలు పం పించడం జరిగిందని కలెక్టర్‌కు తెలిపారు. ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మా ట్లాడుతూ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. చాలా వరకు రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గడిచిన నెలలో తక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఆయా శాఖల అధికారులు లింగయ్య, శాలిని, మేఘాగాంధీ, దేశ్యానాయక్‌, రాములు, లావణ్య, సునీత, ఆయా సర్కిల్‌ల సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:05 PM