మురుగు నీటిని తొలగించాలి
ABN , Publish Date - Sep 15 , 2024 | 10:42 PM
మండలంలోని రంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ చుట్టు మురుగు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
పెబ్బేరు రూరల్, సెప్టెంబరు 15: మండలంలోని రంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ చుట్టు మురుగు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గ్రామంలోని మురుగునీటి ప్రవాహం, వర్షపు నీరు పాఠశాల ప్రహరీ దగ్గర నిలువ ఉండడంతో ఇబ్బంది పడుతు న్నారు. జాతీయ రహదారి పక్కన పాఠశాల ఉండడంతో రోడ్డు అవతలికి మురు గునీరు పోవడానికి వీలు లేకపోవడంతో పాఠశాల ప్రహరీ చుట్టే ఉండిపోతు న్నాయి. ఈ పాఠశాలలో 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు సంవత్సరాలుగా మురుగునీటి దుర్వాసన సమస్యతో విద్యార్థులు, ఉపాధ్యాయు లు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాల ప్రహరీ చుట్టు నిలిచిన మురుగునీటిని తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో రవీందర్‌ను సంప్రదించగా నిల్వ నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.