పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:20 PM
మధ్యాహ్న భోజన కార్మి కుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెం టనే విడుదల చేయాలని కోరుతూ సీఐ టీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్ర వారం తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా చేశారు.
- తహసీల్దార్ కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
దామరగిద్ద/మాగనూరు/నారాయణ పేట రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన కార్మి కుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెం టనే విడుదల చేయాలని కోరుతూ సీఐ టీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్ర వారం తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా చేశారు. దామరగిద్ద తహసీల్ ముందు నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ మం డల కార్యదర్శి జోషి మాట్లాడారు. కార్మికులకు ప్రతీనెలా జీతాలు ఇవ్వక, మధ్యాహ్న భోజన బి ల్లులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి పిల్లలకు వండి పెడుతున్నారని అన్నారు. ఇంత చేసినా కూడా బిల్లులు ఇవ్వకపోగా అధికారుల వేధింపు లు తీవ్రం చేస్తున్నారన్నారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు, బిల్లులు ఇవ్వాలని కోరారు. అనంతరం తహసీల్దార్ జయరాములుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భోజన కార్మికులు సుశీలమ్మ, ఉష నమ్మ, కాశమ్మ, మమత, అంజలమ్మ, మొగులప్ప తదితరులున్నారు. అదేవిధంగా, మాగనూరు తహసీల్ ముందు నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు పి.ఆంజనేయులు, భరత్‌కుమార్‌లు మా ట్లాడారు. మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఏజెన్సీ రద్దు చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. రద్దు చేసిన ఏజెన్సీని పునరుద్దరించాలని, నాణ్యమైన బియ్యాన్ని ప్రభు త్వం అందించాలని, అవసరమైన గ్యాస్ సబ్సిడీ ఇ వ్వాలని, గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాల న్నారు. అనంతరం తహసీల్దార్ సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మధ్యా హ్న భోజన కార్మికుల సంఘం నాయకులు ఉ మాదేవి, సుమిత్ర, దండు లక్ష్మి గంగమ్మ, శాంత మ్మ, తిప్పమ్మ, నాగేంద్రమ్మ, మారెమ్మ ఉన్నారు. నారాయణపేట తహసీల్ ముందు సీఐటీ యూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు బాల్‌రాం మాట్లాడారు. నాయకులు మణెమ్మ, వెంకటమ్మ, యాదమ్మ, ఇందిర, విజయలక్ష్మీ తదితరులున్నారు.