కలిసికట్టుగా ముందుకు సాగాలి
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:24 PM
మనకు మనకు పంచాయితీలు వద్దని అందరు కలసి కట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
హన్వాడ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మనకు మనకు పంచాయితీలు వద్దని అందరు కలసి కట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హన్వాడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి సభకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తీసుకువచ్చి విజయవంతం చేయాలన్నారు. ప్రతీ బూత్ నుంచి 100 మందిని తీసుకురావలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.18 వేల కోట్లతో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే వారు ప్రజలకు దగ్గరై సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలని. కానీ, ప్రజలకు మనమే సమస్య కాకూడదన్నారు. పాత కొత్త అంటూ పంచాయితీలు పెట్టుకుంటే బీజేపీ, బీఆర్‌ఎస్ అన్నట్లు మన పార్టీకు కష్టాలు వస్తాయన్నారు. నాయకులు సురేందర్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేష్, విజయకుమార్, మండల అధ్యక్షుడు మహేందర్, కన్వీనర్ వెంకటయ్య, కృష్ణయ్య, యాదయ్యయాదవ్, వెంకటాద్రి, వాసు, ఖాలీం, చెన్నయ్య, తిరుపతయ్య, నర్సిములు, మోహన్, రామకృష్ణ పాల్గొన్నారు.