రైతులే ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:08 AM
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం, రైతులే నెంబర్ వన్ ప్రాధాన్యత అని రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు.
ఇబ్బందులున్నా రైతు పక్షపాతిగా ఉంటాం
ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన అన్నదాత
వడ్లు కొనడంతో పాటు వెంటనే డబ్బులు చెల్లిస్తున్నాం
రైతు పండగ సదస్సులో రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడి
‘పాలమూరు-రంగారెడ్డి’ పూరి ్తచేస్తే తెలంగాణలో బీడు కనిపించదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మహబూబ్‌నగర్, నవంబరు 29 (ఆంరఽధజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం, రైతులే నెంబర్ వన్ ప్రాధాన్యత అని రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా గొప్పగా రైతు పండగలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు పండగ సదస్సు రెండో రోజు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, ఈర్లపల్లిశంకర్, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులను ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రసంగించారు. దేశంలోనే అత్యధిక వరిసాగు చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారని గుర్తు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్దఎత్తున కొనుగోలు చేయడంతో పాటు వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతుపక్షపాతిగా వారి సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం ఏం చేయాలో రైతులే చెప్పాలన్నారు. అనుభవం కలిగిన ప్రతీ రైతు శాస్త్రవేత్తనేనని, వారి ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. రైతుల అభిప్రాయాల మేరకు పథకాల రూపకల్పన చేస్తామన్నారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరుకు ఆ పేరు పోవాలంటే జిల్లాకు అత్యంత ప్రాధాన్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో బీడు భూములు కనిపించబోవన్నారు. వచ్చే సంవత్సరం ఈ జిల్లాకు ఇతర జిల్లాల నుంచి వచ్చి పనిచేయాలే తప్ప.. ఈ జిల్లా నుంచి బయటకు పోరన్నారు. రైతులు ఒకేరకమైన పంటలు పండించే విధానాన్ని మార్చుకోవాలన్నారు. ఫామ్‌ఆయిల్ పంటలతో మంచి లాభాలు ఉంటాయన్నారు. ఈ తోటలు పెడితే రైతుబంధు, రుణమాఫీపై ఆధారపడే పని ఉండదని, అప్పులు, బోన్‌సలకోసం ఎదురుచూడాల్సిన అవసరం రాదని అన్నారు. ఎండాకాలం పంట మార్చి లోపల కోతలు ప్రారంభిస్తే బియ్యంలో నూకల శాతాన్ని తగ్గించవచ్చన్నారు. ఎండాకాలం పంటకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారో అధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రైతులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతుకమిషన్ అధ్యక్షుడు కోదండరెడ్డి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌రావు, కమిషనర్ గోపి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిరబోయి పాల్గొన్నారు.