Share News

ఎల్లారెడ్డి జీవితం ఆదర్శం : ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:04 PM

ప్రజాప్రతినిధిగా, ప్రజా నాయకుడిగా ప్రజలతో ఎలా ఉండాలో మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి జీవితం చూస్తే తెలుస్తోందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

ఎల్లారెడ్డి జీవితం ఆదర్శం : ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

ఊట్కూర్‌, అక్టోబరు 1 : ప్రజాప్రతినిధిగా, ప్రజా నాయకుడిగా ప్రజలతో ఎలా ఉండాలో మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి జీవితం చూస్తే తెలుస్తోందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎల్లారెడ్డి స్వగృహంలో ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కింది స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసినా నిడారంబరమైన ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందు బాటులో ఉండి సేవలు చేశారని గుర్తు చేశారు. తన శక్తి మేరకు ప్రజలకు సేవలు చేస్తూ నారాయణపేట, మక్తల్‌ నియోజవర్గాల ప్రజల ప్రేమను పొందారని అన్నారు. అం తకుముందు ఊట్కూర్‌ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నారాయణరెడ్డి, జనార్దన్‌రెడ్డి, లక్ష్మీ కాంత్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, విజయసింహారెడ్డి, మోహన్‌రెడ్డి, వెంకటేష్‌ గౌడ్‌, విష్ణుమూర్తి, జమీర్‌ అలీ, ఫయ్యాజ్‌, అబ్దుల్‌ రహమాన్‌, జలాల్‌, అశోక్‌, శంకర్‌, జగదీష్‌గౌడ్‌, సమీ పాల్గొన్నారు.

విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి..

మక్తల్‌ : విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్‌ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏక కాలంలో 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు ప్రతీ పాఠశాలకు వాచ్‌మెన్‌, అటెండర్‌, మరుగుదొడ్ల సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలు సమకూర్చి అధునాతనమైన ఫర్నీచర్‌ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. ఎంఈవో అనిల్‌గౌడ్‌, పీఆర్టీయూ నాయకులు జనార్దన్‌రెడ్డి, చంద్రకాంత్‌గౌడ్‌, గురురాజారావు, విధూర్‌కుమార్‌, తిరుపతి, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:04 PM