వృద్ధులను గౌరవించాలి
ABN , Publish Date - Oct 01 , 2024 | 10:56 PM
వృద్ధులను ప్రతీ ఒక్కరు గౌరవించాలని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సవిల్ న్యాయాధికారి గంటా కవితాదేవి అన్నారు.
- సీనియర్ సివిల్ న్యాయాధికారి గంట కవితాదేవి
- ఘనంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం
గద్వాల న్యూటౌన్, అక్టోబరు 1 : వృద్ధులను ప్రతీ ఒక్కరు గౌరవించాలని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సవిల్ న్యాయాధికారి గంటా కవితాదేవి అన్నారు. అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయో వృద్ధుల విజ్ఞానం, వారి అనుభవం నేటి తరానికి మార్గదర్శకమన్నారు. వారు ఎలాంటి ఒత్తిడికీ లోనవకుండా కుటుంబ సభ్యులతో అనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా న్యాయసేవ అధికార సంస్థ వారికి తోడుగా ఉంటుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన సీనియర్ సిటిజన్లకు జ్ఞాపికలు అందించి, ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింగరావు, లక్ష్మీనారాయణ, ఆర్డీఓ రాంచందర్, ఇన్‌చార్జి డీడబ్ల్యూవో సుజాత, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వినోద్‌కుమార్, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.