Share News

రేపటి నుంచి దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Oct 01 , 2024 | 10:49 PM

ఐదో శక్తిపీఠం అలంపూర్‌ జోగుళాంబదేవి అమ్మవారి ఆలయంలో దసరా పండగను పురస్కరించుకొని ఈనెల మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పురందర్‌కుమార్‌ తెలిపారు.

రేపటి నుంచి దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు
విద్యుత్‌ దీపాల వెలుతురులో జోగుళాంబ ఆలయం

ఐదో శక్తిపీఠం అలంపూర్‌ జోగుళాంబదేవి అమ్మవారి ఆలయంలో దసరా పండగను పురస్కరించుకొని ఈనెల మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పురందర్‌కుమార్‌ తెలిపారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గద్వాల డీఎస్సీ సత్యనారాయణ, అలంపూర్‌ సీఐ రవిబాబు, ఎస్‌ఐ వెంకటస్వామి ఏర్పాట్లను పరిశీలించారు.

- అలంపూర్‌

Updated Date - Oct 01 , 2024 | 10:49 PM