దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 01 , 2024 | 10:52 PM
జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో ఈ నెల మూడు నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
- మూడు నుంచి 12వ తేదీ వరకు అలంపూర్‌లో శరన్నవరాత్రి వేడుకలు
- సమీక్షా సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, అక్టోబరు 1 : జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో ఈ నెల మూడు నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాలపై కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశమందిరంలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తుల భద్రత, సౌకర్యాలను పర్యవేక్షిస్తూ, ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 12న సాయంత్రం 7.30 గంటలకు తుంగభద్రనది పుష్కర ఘాట్‌వద్ద తెప్సో త్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెప్పను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో రాంచందర్, ఈవో పురేందర్, అలంపూర్ తహ సీల్దార్ మంజుల పాల్గొన్నారు.
భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
గద్వాల : నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారు లను ఆదేశించారు. పట్టణంలోని దౌదర్‌పల్లి దర్గా వద్ద నిర్మిస్తున్న కళాశాల నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అసంపూర్తి పనులపై ఆరా తీశారు. మొదట జీప్లస్ వన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తరగతి గదులు, ల్యాబ్‌తో పాటు, ఇతర సౌకర్యాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అన్ని పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం, నిర్దిష్ఠ గడువులోగా పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కళాశాలను తనిఖీ చేశారు. మొత్తం 300 మంది విద్యార్థులున్నారని, పా త ఎస్పీ కార్యాలయంలో ద్వితీయ, తృతీయ తరగతులు, గంజిపేటలోని కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హను మంతమ్మ ఆయనకు వివరించారు. కళాశాల నూతన భవన నిర్మాణం కొద్ది నెలల్లో పూర్తవుతుందని, అప్పటివరకు వరకు విద్యార్థులకు ఇబ్బంది కలుగ కుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట టీజీఎంఎస్ ఐడీపీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైపాల్‌రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సురేశ్, ఏఈ రహీమొద్దీన్ తదితరులు ఉన్నారు.