కాంగ్రెస్ ప్రభుత్వానిది బుల్‌డోజర్ పాలన
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:13 PM
రాష్ట్రంలో, నియో జకవర్గంలో అభివృద్ధిని మరిచి పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్‌డోజర్ పాలన నడిపిస్తోందని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనా ర్దన్‌రెడ్డి విమర్శించారు.
- చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 1 : రాష్ట్రంలో, నియో జకవర్గంలో అభివృద్ధిని మరిచి పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్‌డోజర్ పాలన నడిపిస్తోందని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనా ర్దన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలవుతున్నా చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వం ప్రజలను దృష్టిని మళ్లీంచేందుకు హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ కమర్షియల్ డ్రామాలకు తెర లేపిందని ఆరోపించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో అనుభవం లేని నాయ కుల పాలనలో అధికారులతో సమన్వయం కరువై అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అ క్రమ కేసులు పెడితే సహించేది లేదని పోలీసులను హెచ్చరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు తండ్రీ కొడుకుల మధ్య సమన్వయమే లేన్నప్పుడు ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తాను చేసిన పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం తప్పితే వారు చేసిందేమీ లేదని విమర్శించారు. చైర్మన్, వైస్ చైర్మన్ లేకుండానే మునిసిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి నిధులను దుర్వినియోగం చేశారని, దీనిపై తాము కోర్టుకు వెళ్లేం దుకు సిద్ధంగా ఉన్నామన్నారు.