దారులన్నీ ఇంటివైపే
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:16 PM
నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దసరా సెల వులు ప్రకటించడంతో మంగళవారం సాయంత్రం నుంచే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటిదారి పట్టారు.
- పాఠశాలలకు దసరా సెలవులు
- విద్యార్థులతో కిటకిటలాడిన బస్టాండ్లు
అచ్చంపేట, అక్టోబరు 1 : నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దసరా సెల వులు ప్రకటించడంతో మంగళవారం సాయంత్రం నుంచే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటిదారి పట్టారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలలతో పాటు వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు తమ తమ సామ గ్రితో ఇంటికి వెళ్లేందుకు ఒక్కసారిగా బస్టాండ్‌కు రావడంతో విద్యార్థులతో బస్టాండ్ రద్దీగా మారింది. రహణా సౌకర్యం లేనివారు ద్విచక్ర వాహనాలపై తరలివెళ్లారు. మొత్తంమీద గ్రామాలకు విద్యార్థులు తరలి వస్తుండడంతో పల్లెలు పిల్లలతో కళకళలాడుతున్నాయి.