Share News

ప్రతీ కుటుంబానికి డిజిటల్‌ కార్డు

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:14 PM

ప్రతీ కుటుంబానికి డిజిటల్‌ కార్డు అందజేయనున్నట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు.

ప్రతీ కుటుంబానికి డిజిటల్‌ కార్డు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ కుటుంబానికి డిజిటల్‌ కార్డు అందజేయనున్నట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలిసి ఫ్యామిలీ డిజిటల్‌ కా ర్డులు, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, డబుల్‌ బెడ్‌రూం, ధాన్యం తదితర అంశాలపై కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ మందిరం నుంచి కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, అదనపు కలెక్టర్‌ దేవసహాయంతో కలిసి సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నాలుగు నియో జకవర్గాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టే కుటుంబ డిజిటల్‌ కార్డుల గుర్తింపు కార్డులను సమర్థవం తంగా నిర్వర్తించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లి కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి నమోదు చేయాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి జిల్లా, మండల, మునిసిపల్‌ స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించే దరఖాస్తుదారులకు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వివరించాలని ఆ దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీపీవో రామ్మోహన్‌రావు, నాలుగు నియోజకవర్గాల ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:14 PM