ప్రాణం తీసిన ఈత సరదా
ABN , Publish Date - Oct 31 , 2024 | 02:07 AM
ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు ఆవాస గ్రామం అబీద్‌నగర్‌లో ఈ విషాదం నెలకొంది.
ప్రాణం తీసిన ఈత సరదా
ఇద్దరు విద్యార్థులు మృతి
యదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
మోటకొండూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు ఆవాస గ్రామం అబీద్‌నగర్‌లో ఈ విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అబీద్‌నగర్ గ్రామానికి చెందిన యెగమటి రాహుల్‌రెడ్డి హైదరాబాద్‌లోని రామంతాపూర్ గల శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దీపావళి సెలవుల నేపథ్యంలో రాహుల్‌రెడ్డి ఆహ్వానం మేరకు కళాశాలలో చదువుతున్న 11మంది విద్యార్థులు బుధవారం అబీద్‌నగర్ గ్రామానికి వచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో సరదాగా గడిపేందుకు స్నేహితుని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి అక్కడ పొలాల్లో కలియదిరిగారు. పక్కనే ఉన్న బస్వరాజ్ కుంటలో ఈత కొట్టేందుకు డొంకెన శ్రీచరణ్, (27), నంగునూరి శశివరుణ్ (18) దిగారు. వారికి ఈత రాక నీటిలో మునిగిపోతుండటంతో గమనించిన మరో విద్యార్థి కాపాడేందుకు ప్రయత్నంలో కాలుజారి నీటిలో పడ్డాడు. పక్కనే ఉన్న రాహుల్‌రెడ్డి లాగటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కుంటలోకి దిగిన ఇద్దరు విద్యార్థులు మునిగిపోగా, పక్కనే ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. దీంతో గ్రామస్థులు కుంటలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. మృతులు రం గారెడ్డి జిల్లా హయతనగర్ మండలం గౌరెల్లికి చెందిన డొంకెన శ్రీచరణ్, మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మండలం బోడుప్పల్‌కు చెందిన నంగునూరి శశివరుణ్‌గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రమే్‌షకుమార్, సీఐ కొండల్‌రావు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డొంకెన శ్రీచరణ్ తండ్రి బాలరాజుగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ పాండు తెలిపారు.