Share News

హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:14 AM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నా రు.

హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం
లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

- ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

వెల్గటూర్‌, సెప్టెంబరు 11: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నా రు. బుధవారం వెల్గటూర్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు నిర్వాసితుల చెక్కులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్‌ చెక్కులను ఆర్డీవో మధుసూదన్‌తో కలిసి పంపిణీ చేశారు. ముక్కట్రావ్‌పేటకు చెందిన 24 మంది భూ నిర్వాసితులకు రూ.52 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేశారు. వెల్గటూర్‌ మండలానికి చెందిన 45 మందికి రూ.45,05,220 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులు, ఎండపల్లి మండలానికి చెందిన 31 మందికి రూ.31,03,596 విలువ గల చెక్కులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడగానే సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకపోగానే స్పందించి మిగిలిన పరిహారాన్ని మం జూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. చెగ్యాం గ్రామానికి చెందిన 126 మంది నిర్వాసితులకు రూ.18 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పది సంవత్సరాలు అధికారం లో ఉండి నిర్వాసితుల గురించి పట్టించుకోని వారు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తు న్నారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శేఖర్‌, ఎంపీడీవో, డీటీ సంతోష్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గోపిక జితేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, మేరు గు మురళి, బందెల ఉదయ్‌, సందీప్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు పాల్గొన్నారు.

- ప్రతీ ఒక్కరికి మెరుగైన వైద్యం..

పెగడపల్లి: ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యచికిత్సలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్‌ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పెగడపల్లి మండ లంలోని వెంగళాయిపేట గ్రామానికి చెందిన అంగలి సంతోష్‌ అనారోగ్యంతో బాదపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా చికిత్స ఖర్చులు పెట్టే ఆర్థిక స్థోమత లేక స్థానిక నాయకుల ద్వారా ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు లక్ష్మణ్‌కుమార్‌ లక్ష రూపాయలు ఎల్‌వోసీ మంజూ రు చేయించి బాధితుడి తండ్రికి బుధవారం అందజే శారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కడారి తిరుపతి, పూసాల తిరుపతి, సంధి మల్లారెడ్డి, కుం చె రాజేందర్‌, తోట మల్లేశం పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:14 AM