నేడు దీపావళి
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:04 AM
దీపావళి పండుగను జిల్లా వ్యాప్తంగా గురువారం జరుపుకోనున్నారు. ఈ సారి చతుర్దశి గురువారం మధ్యాహ్నం వరకు ఉండడంతో మంగళహారతులు, అనంతరం అమావాస్య వస్తుండటంతో అర్ధరాత్రి వరకు దీపావళి పూజలు చేసుకోవచ్చు. శుక్రవారం స్వాతీ నక్షత్రంతో కూడిన అమావాస్య ఉదయం వరకు ఉండడంతో దీపావళి పూజలు, వ్రతాలు జరుపుకోవాలని, పడిపోయిన, కొత్త, పంచకునే నోములు ఆచరించవచ్చని అర్చకులు చెబుతున్నారు.
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 30: దీపావళి పండుగను జిల్లా వ్యాప్తంగా గురువారం జరుపుకోనున్నారు. ఈ సారి చతుర్దశి గురువారం మధ్యాహ్నం వరకు ఉండడంతో మంగళహారతులు, అనంతరం అమావాస్య వస్తుండటంతో అర్ధరాత్రి వరకు దీపావళి పూజలు చేసుకోవచ్చు. శుక్రవారం స్వాతీ నక్షత్రంతో కూడిన అమావాస్య ఉదయం వరకు ఉండడంతో దీపావళి పూజలు, వ్రతాలు జరుపుకోవాలని, పడిపోయిన, కొత్త, పంచకునే నోములు ఆచరించవచ్చని అర్చకులు చెబుతున్నారు.
ఫ ఘనంగా ధన త్రయోదశి
దీపావళి వేడుకల్లో తొలిఘట్టం ఽధనత్రయోదశి వేడుకను బుధవారం నగరవాసులు జరుపుకున్నారు. ధన్‌తేరాస్ నాడు బంగారం, వెండిని పిసరంతైనా కొనుగోలు చేసి పాత నగదు బిళ్లలకు కొత్త నగదును కల్పి పూజలు ప్రారంభించారు. బంగారు దుకాణాలు, జువెల్లరీ షాపుల్లో ఆభరణాలను, బంగారాన్ని ప్రజల స్థాయిలకు తగ్గట్టుగా సిద్ధంగా ఉంచారు. వస్త్ర, వ్యాపార, వాణిజ్య నిలయాలను, కార్యాలయాలను శుద్ధి చేసి రంగులు వేసి మామిడి తోరణాలు, పసుపు, కుంకుమలు, పూలు విద్యుద్దీపాలతో అలంకరించారు. పూజా మందిరాలు, దేవుడి పటాలను శుద్ధి చేసి అలంకారాలు చేశారు. గత సంవత్సరం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా సుమారు మూడున్నర కోట్ల వ్యాపారం జరుగగా ఈ యేడు మాసాంతపు రోజులు కావడం, ధరలు పెరగడంతో పెద్దగా అమ్మకాలు సాగలేదు. ఈ యేడు రెండున్నర కోట్ల వరకు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.