Share News

దేశ సంపద కార్పొరేట్‌ కంపెనీల పరం

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:19 AM

భగత్‌నగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి జ్యోతి విమర్శించారు. శుక్రవారం సీపీఎం జిల్లాకార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగిన కరీంనగర్‌ జిల్లా10వ సభలో ఆమె మాట్లాడారు.

దేశ సంపద కార్పొరేట్‌ కంపెనీల పరం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి

భగత్‌నగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి జ్యోతి విమర్శించారు. శుక్రవారం సీపీఎం జిల్లాకార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగిన కరీంనగర్‌ జిల్లా10వ సభలో ఆమె మాట్లాడారు. బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తూ కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందన్నారు. నిత్యావరసర వస్తువుల ధరలు అకాశాన్ని అంటాయని, పెట్రోల్‌, డిజీల్‌ ధరలను జీఎస్టీలోకి తీసుకురాకపోవడమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పారీ ్టఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్‌ చౌక్‌ నుంచి కోతిరాంపూర్‌లోని సీపీఎం కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు జె వెంకటేశ్‌, జిల్లాకార్యదర్శి వర్గ సభ్యుడు గీట్లముకుందరెడ్డి, వర్ణ వెంకట్‌రెడ్డి గుడికందుల సత్యం, జి భీమాసాహెబ్‌, యు శ్రీనివాస్‌, సుంకరి సంపత్‌, ఎడ్ల రమేష్‌, శీలం అశోక్‌, వెలమరెడ్డి రాజిరెడ్డి, జి రాజేశం, నరేష్‌పటేల్‌, మక్కపల్లి పూజ, పున్నం రవి, భద్రయ్య, గుండేటి వాసుదేవరెడ్డి, రాయికంటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:20 AM