Share News

మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:59 PM

ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తు న్నానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ ఏరి యా ఆసుపత్రిలో శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వసంతరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పెంచలయ్యతో కలిసి మైనర్‌ ఓటీ విభాగాన్ని ప్రారంభించారు

మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
ఓటీ విభాగాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ టౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తు న్నానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ ఏరి యా ఆసుపత్రిలో శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వసంతరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పెంచలయ్యతో కలిసి మైనర్‌ ఓటీ విభాగాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్‌ బ్యాంకు కోసం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు స్థలం కేటాయింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు, రాజన్న భక్తులకు అత్యవసర సమయాల్లో రక్తం సులువుగా దొరుకుతుం దన్నారు. రాజన్న భక్తులతోపాటు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందుబా టులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో వేములవాడలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవన నిర్మాణం కోసం ఆసు పత్రి ఆవరణలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. ఈ సంద ర్భంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ గౌరవ అధ్య క్షుడు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలి పారు. సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు గుడ్ల రవి, ఉపాధ్యాక్షులు ప్రయకరావు, వేణు కుమార్‌, కార్యదర్శి శివ, కమిటీ సభ్యులు సంగీ తం శ్రీనివాస్‌, బూడిమే శివప్రసాద్‌, రఘు, వెంక టేశం, రాజమల్లు, నాగశంకర్‌, ఎల్ల లక్ష్మీ నారాయణకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 30 , 2024 | 12:00 AM