Share News

ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:31 AM

ప్రజాసంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోం దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.

ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 4: ప్రజాసంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోం దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. స్థానిక ఆర్య వైశ్య భవనంలో బుధవారం 173 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు కోటి 73లక్షల 45వేల 97 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలనలో నియోజకవర్గంలో పలు దఫాలు గా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. ఈనెల 17న రెండో విడత ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్దఎత్తున చేపడుతోం దని, గతంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పథకాల్లో కొన్ని అందకపోవడంతో తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతిఒక్కరి నుంచి అధికారులే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్‌ రాజ్‌కు మార్‌, కౌన్సిలర్లు, మండల మాజీ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకు లు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:31 AM