సింగరేణి స్థలాన్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:19 AM
గోదావరిఖని నడిబొడ్డున ఉన్న రూ.40కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రామగుండం తహసీల్దార్ కుమారస్వామి సింగరేణి ఎస్టేట్ అధికారి ఆర్ కుమారస్వామి నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.
కోల్‌సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని నడిబొడ్డున ఉన్న రూ.40కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రామగుండం తహసీల్దార్ కుమారస్వామి సింగరేణి ఎస్టేట్ అధికారి ఆర్ కుమారస్వామి నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. ఇన్నా ళ్లు లీజు హోల్డర్ల ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని సింగరేణి పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. మూతపడిన ఓల్డ్ అశోక థియేటర్ స్థలం ప్రభుత్వ స్థలమని, దానిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగిం చాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సింగరేణి జనగామ శివారు సర్వే నెం.638లోని 34గుంటల స్థలాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఇటీవల లేఖ రాసింది. సింగరేణి లేఖను అనుసరించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ రామగుండం తహసీల్దార్‌ను ఆదేశించారు.
సింగరేణి అవసరాలకు స్థలాన్ని ఇచ్చిన ప్రభుత్వం
1965ప్రాంతంలో సింగరేణి మైనింగ్, ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ స్థలాలను సింగరేణికి చార్జిమెమో ద్వారా అప్పగించింది. జనగామ శివారు సర్వే నంబర్ 638 పూర్తిగా ప్రభుత్వ స్థలం. సింగరేణి స్వాధీనంలోని ఈ స్థలంలో కార్మికుల వినోద అవసరాలకు సినిమా థియేటర్ నిర్మిస్తామని ఎస్ రాజయ్య, అతని భాగస్వామ్యులు సింగరేణికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ అనుమతితో సింగరేణి లీజుకు ఇచ్చింది. 150/250మీటర్ల విస్తీర్ణంతో థియేటర్‌కు స్థలం కేటాయించారు. ఆ సమయంలో యాజ మాన్యం షరతులు కూడా పెట్టింది. అనంతర పరిణామాల్లో థియేటర్ యజమాని మరణించడం, ఆర్థిక వివరాలతో థియేటర్ మూతపడింది. థియేటర్‌కు కేటాయించిన స్థలంలో గదులు నిర్మించి వ్యాపారాలు చేశారు. 25ఏళ్లుగా థియేటర్ మూతపడే ఉంది. ఈ స్థలాన్ని తిరిగి తమకు అప్పగించాలని సింగరేణి లీజుదారులకు నోటీసులు ఇచ్చి ఎవిక్షన్ కూడా చేసింది. జిల్లా కోర్టుల్లో కూడా సింగరేణికి అనుకూలంగా తీర్పులు వచ్చా యి. ఇటీవల కాలంలో మూసివేసి ఉన్న థియేటర్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయం టూ నిర్మాణాలను కూల్చివేశారు. సింగరేణి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నది. ఇటీవల స్థలంపై ఉన్న కేసులో స్టే కూడా ఎత్తివేశారు. ఈ పరిస్థితుల్లో స్థలాన్ని తిరిగి రెవెన్యూ కు అప్పగిస్తూ సింగరేణి నిర్ణయం తీసుకున్నది. ఓల్డ్ అశోక థియేటర్ స్థలాన్ని సింగ రేణి ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంతో రూ.40 కోట్ల స్థలం ప్రభుత్వ స్థలంగా మా రింది. ఇక ప్రజోపయోగాలకు సంబంధించి నిర్మాణాలు, ఇతర అవసరాలకు స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది. కాగా లీజుదారు లుగా పేర్కొంటున్న వారి స్వాధీనంలో కొంత స్థలం ఉంది. దీనిపై కోర్టులో కేసు ఉందని వారు పేర్కొంటున్నారు.