మోడల్ స్కూల్.. జలమయం
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:23 AM
మండలంలోని కురిసిన వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమారం శివారులోని మోడల్ స్కూల్ పూర్తిగా జలమయమయింది.
సైదాపూర్, సెప్టెంబరు 4: మండలంలోని కురిసిన వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమారం శివారులోని మోడల్ స్కూల్ పూర్తిగా జలమయమయింది. స్కూల్ చుట్టూ వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులకు బుధవారం సెలవు ప్రకటించారు. మోడల్ స్కూల్ చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, వెంటనే ప్రభుత్వం, పై అధికారులు స్పందించి ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లి తండ్రులు కోరుతున్నారు. గతంలో ప్రహరీ పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. ప్రతీ వర్షాకాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు.