Share News

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:28 AM

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మెస్‌ వర్కర్లు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ హెచ్చరించారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
మోడల్‌ స్కూల్‌లో ల్యాబ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కథలాపూర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మెస్‌ వర్కర్లు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ హెచ్చరించారు. మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదులు పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించేలా చూడాలని సూచించారు. పరిసరాలను పరిశీలించి ఆవరణలో చెత్త చెదారం, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని ఆదేశించారు. ల్యాబ్‌ను పరిశీలించి ప్రయోగాలు ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలన్నారు. హైమాస్ట్‌ లైట్‌ ఏర్పాటు చేయడంతో పాటు మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మురికినీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం తక్కళ్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రవాణా, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సీఈవో రాంప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని ఆదేశించారుు. కలెక్టర్‌ వెంట కోరుట్ల ఆర్డీవో జికేంధర్‌రెడ్డి, తహసీల్దార్‌ వినోద్‌, ఆర్‌ఐ నగేశ్‌, ప్రిన్సిపాల్‌ అనిత, సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ బత్తుల నరేశ్‌, రైతులు ఉన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:28 AM