Share News

నిరుపేదల ఉసురు కాంగ్రెస్‌కు తగులుతుంది

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:42 PM

హైడ్రా విషయంలో నిరుపేదల ఉసురు కాంగ్రెస్‌ పార్టీకి తగులుతుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. ఆయన మంగళవారం మానకొండూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ హైడ్రా జీవోలో ఏముందో మంత్రి సీతక్కకు తెలుసా అని ప్రశ్నించారు.

నిరుపేదల ఉసురు కాంగ్రెస్‌కు తగులుతుంది
మానకొండూర్‌లో మాట్లాడుతున్న జీవీ రామకృష్ణారావు

మానకొండూర్‌, అక్టోబరు 1: హైడ్రా విషయంలో నిరుపేదల ఉసురు కాంగ్రెస్‌ పార్టీకి తగులుతుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. ఆయన మంగళవారం మానకొండూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ హైడ్రా జీవోలో ఏముందో మంత్రి సీతక్కకు తెలుసా అని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌, పార్కులు, నాళాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు, అక్రమ కట్టడాలను తొలగించాలని జీవోలో ఉందన్నారు. దాన్ని అస్త్రంగా తీసుకొని రాష్ట్రప్రభుత్వం నిరుపేదల ఇళ్లను కూలగొడుతూ వారిని రోడ్డు పాలు చేసిందన్నారు. అలాంటి నిరుపేదలు తమను ఆదుకోవాలని తెలంగాణ భవన్‌కు వస్తే బీఆర్‌ఎస్‌ నాయకులు ఉద్యమాలు చేయడం తప్పా అని ప్రశ్నించారు. నిరుపేదలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందన్నారు. హైడ్రా విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా రావడం బాధాకరమన్నారు. మానకొండూర్‌ మండలంలో రోడ్ల పరిస్థితి ఇద్దరు మంత్రులకు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్‌గౌడ్‌, నాయకులు రామంచ గోపాల్‌రెడ్డి, పిట్ల మధు, రాచకట్ల వెంకట్‌స్వామి, పిండి సందీప్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:42 PM