ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెద్దపల్లి ‘హస్త’గతం

ABN, Publish Date - Jun 05 , 2024 | 12:10 AM

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ హస్తగతమయ్యింది. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 1,31,771 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ హస్తగతమయ్యింది. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 1,31,771 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేసింది. ఇక్కడి నుంచి చివరిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తండ్రి అయిన చెన్నూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ డాక్టర్‌ వివేక్‌ గెలుపొందగా, తిరిగి ఆయన తనయుడు ఇక్కడి నుంచి గెలుపొందడం విశేషం. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్‌ సాధించాలని తహతహలాడినప్పటికీ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. మూడో స్థానంలో నిలుస్తుందని అనుకున్న బీజేపీ అనూహ్యంగా పోలింగ్‌కు రెండు రోజుల ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ మానియా, అయోధ్యలో రామాలయ నిర్మాణం, రాముడి అక్షింతలు, హిందూవాదంతో బీజేపీ గట్టి పోటినిచ్చి రెండో స్థానంలో నిలిచింది. మే 13వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ జరగగా, మంగళవారం జిల్లాలోని సెంటినరీకాలనీలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌లోగల ఒక ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరిపారు. పార్లమెంట్‌ సాధారణ ఎన్నికల పరిశీలకులు రావిశ్‌గుప్తా, పార్లమెంట్‌ ఎన్నికల అధికారి, పెద్దపల్లి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ పర్యవేక్షణలో కౌంటింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో లెక్కింపు ప్రారంభించారు. 8.30 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్లను లెక్కించడం ప్రారంభించారు. మొత్తం 21 రౌండ్లలో లెక్కింపు జరిపారు. ఈ నియోజకవర్గంలో 15,96,430 ఓట్లకు 10,83,453 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 4,80,994 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌కు 3,49,339 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 1,94,821 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి 1,31,771 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి నుంచి చివరి రౌండ్‌ వరకు, పోస్టల్‌ బ్యాలెట్లలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఆధిక్యం కనబరిచారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మొదటి నుంచి మూడవ స్థానంలోనే ఉంటూ వచ్చారు. పార్లమెంట్‌ పరిధిలో మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో 52,957 ఓట్లు, పెద్దపల్లి నియోజకవర్గంలో 5,325 ఓట్లు, రామగుండంలో 10,131 ఓట్లు, మంచిర్యాలలో 19,457 ఓట్లు, చెన్నూరులో 24,714 ఓట్లు, బెల్లంపల్లిలో 24,580 ఓట్ల వరకు మెజారిటీ వచ్చింది. ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్‌పై బీజేపీ 8,080 ఓట్ల మెజారిటీ సాధించడం గమనార్హం.

ఫ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌..

అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్‌లోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. చివరి రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, నియోజకవర్గాల్లో సైలెంట్‌ ఓటింగ్‌ జరగడంతో ఒక దశలో బీజేపీ గెలుస్తుందనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్నది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌ స్థానాల్లోను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు క్లీన్‌ స్వీప్‌ చేశారు. ఆ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 2 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందుతారనే అంచనాలు ఉండేవి. పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయని కారణంగా, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు లోపాయికారిగా బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్‌ మెజారిటీ తగ్గిందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 6,82,033 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 4,80,994 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి 3,73,156 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 1,94,821 వచ్చాయి. బీజేపీకి 79,324 ఓట్లు రాగా, ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుని 3,49,339 ఓట్లు సాధించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఇంత పెద్దమొత్తంలో ఓట్లు రావడం ఇదే ప్రథమం. అంతకుముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన కాసిపేట లింగయ్యకు 1,58,979 ఓట్లు సాధించారు. రసవత్తరంగా సాగిన ఈ పోరులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. సంబరాల్లో జరుపుకుంటున్నారు.

ఫ తండ్రి, తనయుల ‘చేతి’లో ఓడిన గొమాసే..

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసిన గొమాసే శ్రీనివాస్‌ ఒకసారి తండ్రి చేతిలో, ప్రస్తుతం తనయుడి చేతిలో ఓటమి చెందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో గొమాసే శ్రీనివాస్‌ అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి 2,64,731 ఓట్లు సాధించారు. మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్‌ జి వివేక్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారిగా పోటీ చేసి 3,13,748 ఓట్లు సాధించి 49,017 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో డాక్టర్‌ జి వివేక్‌ వారసుడిగా పోటీ చేసిన ఆయన తనయుడు గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించిన గొమాసే శ్రీనివాస్‌కు తనకు టిక్కెట్‌ రాదని భావించి బీజేపీలో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిన మూడు రోజులకే ఆ పార్టీ టిక్కెట్‌ దక్కింది. ఈ ఎన్నికల్లో వంశీకృష్ణకు, 4,80,994 ఓట్లు రాగా, గొమాసే శ్రీనివాస్‌కు 3,44,223 ఓట్లు వచ్చాయి. గొమాసే శ్రీనివాస్‌పై వంశీకృష్ణ 1,31,771 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంగళవారం జరిగిన కౌంటింగ్‌ అనంతరం 2009 ఎన్నికలు, ఈ ఎన్నికల ఫలితాలను పలువురు నెమరు వేసుకున్నారు.

ఫ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెజారిటీలు..

పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాం గ్రెస్‌ పార్టీకి ఆరు నియోజకవర్గాల్లో మెజారిటీ రాగా, ధర్మపురి నియోజక వర్గంలో మాత్రం బీజేపీకి మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీకి బెల్లంపల్లి నియోజకవర్గంలో 24,580 ఓట్లు, చెన్నూర్‌ నియోజకవర్గంలో 24,714 ఓట్లు, మంచిర్యాల నియోజకవర్గంలో 19,457 ఓట్లు, మంథని నియోజకవర్గంలో 52,957 ఓట్లు, పెద్దపల్లి నియోజకవర్గంలో 5,325 ఓట్లు, రామగుండం నియోజకవర్గంలో 10,131 ఓట్లు వచ్చాయి. బీజేపీకి ధర్మపురిలో కాంగ్రెస్‌ కంటే 8,080 ఓట్ల మెజారిటీ వచ్చింది.

Updated Date - Jun 05 , 2024 | 12:10 AM

Advertising
Advertising