మట్టి గణపతులను పూజించాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:17 AM
పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మట్టి గణపతులను పూజించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 4: పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మట్టి గణపతులను పూజించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహా నీటిలో కరగడానికి సంవత్సరాలు పడుతుందని అన్నారు. మట్టితో తయారు చేసే విగ్రహాలు నీటిలో త్వరగా కరుగుతాయన్నారు. మట్టి గణపతులను వినియోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని మండలి ఈఈ భిక్షపతి, ఏఈ సీహెచ్ వీరేష్ తెలిపారు. ప్రతి జిల్లాకు రెండు వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిచేస్తామన్నారు.