గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:56 PM
జిల్లాలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాలలు వసతి గృహాలలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు అవసర మైన మౌలిక వసతుల కల్పన, చిన్నచిన్న పెండింగ్ పనులు పది రోజుల వ్యవధిలో పూర్తిచేయాలని సూచించారు. నైట్‌డ్యూటీ చేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాస్టల్లో వద్ద విధులు నిర్వహించాలని, హాస్టల్ వార్డెన్లు 24 గంటల పాటు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహించి విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్, డీఈవో జనార్ధన్, సీడీపీవో కవిత, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌లు, అధికారులు పాల్గొన్నారు.