Share News

ధర్మగుండంలో గణపయ్య నిమజ్జనం

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:01 AM

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న ఆది దేవుడు విగ్నేశ్వరుడి నిమజ్జనోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

 ధర్మగుండంలో గణపయ్య నిమజ్జనం
ధర్మగుండంలో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న అర్చకులు, సిబ్బంది

వేములవాడ, సెప్టెంబరు 15 : గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న ఆది దేవుడు విగ్నేశ్వరుడి నిమజ్జనోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల కోసం రాజన్న ఆలయ ఆవరణలోని నాగిరెడ్డి మండపంలో ప్రతిష్టించిన విఘ్నేశ్వరుడికి ఆలయ అర్చకులు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజైన ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు హవనము నిర్వహించి పూర్ణాహుతి, రాత్రి ప్రత్యేక పూజల తదుపరి పట్టణ వీధుల మీదుగా గణేశుడి శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. ధర్మగుండంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్‌ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:01 AM