రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:17 AM
రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభు త్వం విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 1: రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభు త్వం విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నిర సన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. జిల్లాలో లక్ష లాది మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. దీనిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అదనపు కలెక్టర్‌కు అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో లక్షా 52వేల మందికి రుణమా ఫీ చేయాల్సి ఉండగా 51వేల మంది రైతులకు రుణమాఫీ జరిగింద న్నారు. ఈ పరిస్థితి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నా రు. రుణమాఫీ, రైతుభరోసా, అసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ తులం బంగారం ఇవన్నీ అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పదే ళ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి నెలకొనలేదన్నారు. ఈ ప్రభు త్వానికి చరమగీతం పాడేందుకు రైతులు, ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకం టి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మ న్ పుట్ట మధూకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, పార్టీ అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ గంట రాములు, నాయకులు దాసరి ఉష, మాజీ ఎంపీపీలు నునేటి సంపత్, బాలాజీ రావు, నాయకులు బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.