ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:28 AM
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సం దర్భంగా ఆదివారం రామగుండం లయన్స్‌క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్, సెప్టెంబరు 15: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సం దర్భంగా ఆదివారం రామగుండం లయన్స్‌క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, జైపూర్ పవర్‌ప్లాంట్ జీఎం ఎన్‌కే రాజశేఖర్ హాజరై మాట్లాడారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని అన్నారు. లలిత్‌కుమార్, రాజశేఖర్‌తో పాటు ట్రాన్స్‌కో ఏడీఈ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మినేష్ నారాయణ ఠండన్‌ను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. లయన్స్‌క్లబ్ సభ్యులు ప్ర మోద్‌కుమార్‌రెడ్డి, ఎల్లప్ప, గోవర్ధన్‌రెడ్డి, రాజేందర్, రామస్వామి, తిలక్‌చక్ర వర్తి, శరత్‌బాబు, ఆంజనేయులు, మనోజ్‌కుమార్, లక్ష్మారెడ్డి, సారయ్య, సు ధాకర్, సత్యనారాయణ, వెంకటేశం, బేణిగోపాల్‌త్రివేది, లక్కం బిక్షపతి, కోలేటి శ్రీనివాస్, తిరుపతి, రంగమ్మ పాల్గొన్నారు.
యైుటింక్లయిన్‌కాలనీ : ఆర్జీ-2 ఏరియాలో ఆదివారం ఇంజనీర్స్ డే నిర్వ హించారు. జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీఎం సూర్యనా రాయణ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులు అర్పించారు. డీజీఎం (పర్సనల్) అనిల్‌కుమార్, అధికారులు విన య్ సాగర్, ప్రతాపగిరి రాజు, మురళీకృష్ణ పాల్గొన్నారు. కాగా, ఓసీపీ-1లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని వేడుకలను ఆదివారం ఓసీపీ-1 ప్రాజెక్టులో అధికారులు ఘనంగా జరుపుకున్నారు. ప్రాజెక్టు అధికారి రాధా కృష్ణ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. మేనేజర్ ఉదయ్ హరిజన్, అధికారులు కాశీ విశ్వేశ్వరరావు, ఉదయ్‌భా స్కర్, జ్ఞానేశ్వర్, సత్యనారాయణ, నజీర్ అహ్మద్, శ్రీనివాసరావు, సునీల్‌ప్ర సాద్, సాయికృష్ణతో పాటు మైనింగ్, ఈఅండ్‌ఎం అధికారులు పాల్గొన్నారు.