Share News

బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలి

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:17 AM

న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసులు కృషి చేయాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలి
రికార్డులను తనిఖీ చేస్తున్న ఎస్పీ అశోక్‌ కుమార్‌

- ఎస్పీ అశోక్‌ కుమార్‌

గొల్లపల్లి, ఆక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసులు కృషి చేయాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం వార్షిక తనీఖీల్లో భాగంగా గొల్లపల్లి పోలీసు స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీకి ఎస్సై చిర్ర సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రైమ్‌ రికార్డులను, రిజిస్టర్లను, ఎంట్రీ చేసిన డేటాను తనిఖీ చేశారు. పెండింగ్‌ కేసులలపై రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. పోలీసు స్టేషన్‌ పరిధిలోని కేసుల నమోదు, శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డు, రైటర్‌ గదులతో పాటు పోలీసుస్టేషన్‌ ఆవరణను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందిచేలా పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసాను పోలీసులు కల్పిస్తున్నారని, దీంతో జిల్లాలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. పోలీసు స్టేషన్‌లో పెట్రోల్‌ కార్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారని, పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులను అభినందించారు. అనంతరం పోలీసు స్టేషన్‌ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచంధర్‌, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సైలు చిర్ర సతీష్‌ కుమార్‌, మాడ శ్రీధర్‌ రెడ్డి, ఉమాసాగర్‌, మహేష్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:17 AM