Share News

అన్ని హంగులతో పెద్దపల్లి పట్టణాభివృద్ధికి కృషి..

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:41 AM

పెద్దపల్లి పట్టణాన్ని అన్ని హంగుల్లో అభివృధ్ధి చేస్తానని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు పేర్కొన్నారు.

అన్ని హంగులతో పెద్దపల్లి పట్టణాభివృద్ధికి కృషి..

పెద్దపల్లి టౌన్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణాన్ని అన్ని హంగుల్లో అభివృధ్ధి చేస్తానని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు పేర్కొన్నారు. పట్టణంలోని 19, 23 వార్డులలో టీయూ ఎఫ్‌ఐడీసీ నిధులు కోటి నల భైతొమ్మిదిన్నర లక్షల రూపా యలతో పలు సీసీ రోడ్లు, డైన్రేజీలు, షెడ్‌, కాంపౌండ్‌ వాల్‌ నూతన నిర్మాణాలకు ఆది వారం శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడా రు. పట్టణాన్ని సుందరికరమైన పరిశుభ్ర పట్టణంగా తీర్చిది ద్దడానికి ప్రజలందరూ సహకరించాలని, అభివృద్ధి కార్యక్ర మాల నిర్మాణాల నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అలా గే అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వార్డులో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి వచ్చాయని దశల వారీగా పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు. గత పాలకుల హయంలో పెద్దపల్లి పట్టణాన్ని అధ్వానమైన స్థితికి తీసుకొచ్చారని, ఎక్కడ చూసినా గుంత లతో కూడిన రోడ్లు దర్శణమిస్తున్నాయన్నారు. ఈ కార్యక్ర మంలో నూగిళ్ళ మల్లయ్య, బొడ్డుపెల్లి శ్రీనివాస్‌, తాడూరి శ్రీమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:41 AM