Share News

ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణ

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:17 AM

ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకొని నేరాలను నియంత్రించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రెనో వేషన్‌ చేసిన పోలీసు విశ్రాంతి భవనాన్ని, సీసీ కెమెరాలను బుధవారం ప్రారంభించారు.

ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణ
పోలీసు విశ్రాంతి భవనాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌, ఎస్పీ

వేములవాడ, సెప్టెంబర్‌ 11 : ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకొని నేరాలను నియంత్రించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రెనో వేషన్‌ చేసిన పోలీసు విశ్రాంతి భవనాన్ని, సీసీ కెమెరాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ నేతృత్వంలో పోలీసు శాఖ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగడం అభినందనీ యమన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పోలీసింగ్‌ విధానంలో అనేక మార్పులు వచ్చాయని, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని నేరాల నియంత్రిస్తూ నిరంతరం సమాజ సేవ చేస్తున్నారని కొనియాడారు.జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వం పోలీసుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందన్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ 24 గంటలపాటు విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేశామన్నారు. మరింత సమర్థవంతంగా పని చేయాలన్నారు. వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధిలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణంలో త్వరలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేస్తామని, క్రమశిక్షణతో పాటించాలని కోరారు. ఏఎస్‌పి శేషాద్రినిరెడ్డి, సీఐలు వీరప్రసాద్‌, శ్రీనివాస్‌, ఎస్సై అంజయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:17 AM