మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:19 AM
జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 1: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం గర్భిణులకు సంపూర్ణ వైద్య సేవలు అందిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. సెప్టెంబర్ నెలలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో 203ప్రసవాలు నిర్వహించామని, అంతేకాకుండా ఆర్థోపెడిక్ సంబం ధించి 39 మేజర్ సర్జరీలు జరిగాయని అన్నారు. గత ఆరు నెలల కాలంలో సుమారు 130ప్రసవాలు జరిగేవని, ఆగస్టు నెల 198 ప్రస వాలు జరగగా, సెప్టెంబర్ మాసంలో 203 ప్రసవాలు జరిగాయని, దీనికి కృషిచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి పీహెచ్‌సీ పరిధి లోని గర్భిణులను ట్రాక్ చేస్తూ వారికి ఆశా, ఏఎన్‌ఎంలను ఆటాచ్ చేసి 102 వాహనాలు సన్నద్ధం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్ర సవాలు పెంచుతున్నామన్నారు. గర్భిణులకు అవసరమైన టిఫా స్కానింగ్, ఇతర పరీక్షలు చేస్తున్నామన్నారు. ఓపీ అధికంగా వస్తు న్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. గైనికల్ సేవలే కాకుండా మిగిలిన విభాగాలను సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ఏమైనా సమస్యలుంటే సూపరింటెండెంట్‌ను సంప్రదించి పరిష్కరించుకోవా లని సూచించారు.ఆస్పత్రి సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్‌కుమార్, డాక్టర్ రవీందర్, మం దల వాసుదేవారెడ్డి, సౌరయ్య తదితరులు పాల్గొన్నారు.