Share News

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా కాంగ్రెస్‌ పాలన..

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:15 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా కాంగ్రెస్‌ పాలన..

పెద్దపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రక ఘట్టం దీక్షా దివస్‌ అని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో 2.22లక్షల ఉద్యోగాలు వచ్చాయని, ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వకుం డా 55వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పడాన్ని ప్రజ లు గమనిస్తున్నారని అన్నారు. పాదయాత్రలు, రహదారుల దిగ్బంధం, రాస్తారోకోలు, ఎన్నో నిరసనలతో తెలంగాణ ఉద్య మం జరిగిందని గుర్తు చేశారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా జరిగిన ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసుకోవడానికే దీక్షా దివస్‌ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అప్పటి సీఎం చంద్ర బాబు నేతృత్వంలో రైతులకు వ్యతిరేకంగా కరెంట్‌ బిల్లు పెట్టేం దుకు తీర్మానం చేయగా దాని వ్యతిరేకించిన కేసీఆర్‌ తన మం త్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. బీడు భూములు, నిరుద్యోగ సమస్య పోవాలంటే తెలంగాణ తప్పక రావాలని నమ్మిన వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు. ఎంతోమంది ఉద్యమాన్ని చేసిన వారు విఫలమయ్యారని, తెలంగాణ రావడానికి అంతి మ నిర్ణయం దీక్ష దివస్‌ అన్నారు. 2008లో 16 మంది ఎమ్మె ల్యేలు, నలుగురు ఎంపీలు, నలుగురు శాసనమండలి సభ్యు లు రాజీనామా చేశారన్నారు. ప్రజలే చైతన్యులై మళ్లీ రాజీనా మా చేసిన వాళ్లను గెలిపించారన్నారు. ఎన్నికయ్యారు 2010 లో మరొక్కసారి పదవులు త్యాగం చేశారన్నారు. తెలంగాణ అంతా ఆషామాషీగా రాలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అని, ఉద్యమకారుల పై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి అని, ఆంధ్రుల అడుగులకు మడుగులు ఒత్తిన ఘనత రేవంత్‌కే దక్కుతుందని, ఆయన రాష్ట్రానికి సీఎం కావడాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఉద్య మాలతో వచ్చిన తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వ 11 నెలల పాలనతో అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. పది సంవత్స రాలు నిరంతరం అభివృద్ధి చేసి ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడం, 24గంటలు కరెంట్‌ ఇవ్వడం వల్లనే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పంట పండిం దని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమి చేసిందని తమ ఘనతగా చెప్పుకుంటుందని ప్రశ్నించారు. తమ హయాంలో 2.22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే, ఉద్యోగాలు ఇవ్వలేదని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వకు న్నా 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. వచ్చే నాలుగేళ్లు తీవ్రమైన ఉద్యమం చేయాల్సి ఉంటుందని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసి ద్ధంగా ఉండాలని కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడు తూ ఎంతో మంది బలిదానాలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావడానికి నాంది పలికింద న్నారు. తెలంగాణ ద్రోహిగా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎంగా కొనసా గుతున్నారని దుయ్యబట్టారు. ఏ స్వార్థం లేకుండా కేసీఆర్‌ స్వయంగా దీక్ష దివస్‌ ఉద్యమానికి పిలుపు ఇస్తే ప్రతి ఒక్కరు భాగస్వాములై తెలంగాణ సాధించుకున్నారు. కాంగ్రెస్‌ పాలన ను ప్రజలు ఎండగడుతున్నారని, దానిని కార్యకర్తలు అందిపు చ్చుకుని సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండాలని సూచిం చారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేవరకు ఎవరు విశ్రమించ వద్దని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మఽధూకర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారం లోకి వచ్చిందని, అయినా వారి తీరు మారలేదన్నారు. కేసీఆర్‌ పథ కాలు, అభివృద్ధి పనులు మీరు మరచిపోయారు. ఇప్పుడు ఆ పథకాలే బాగున్నాయని కాంగ్రెస్‌ వాళ్లు చెబుతున్నార న్నారు. ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ పని చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ చరిత్ర లో మరచిపోని రోజు నవంబరు 29 అని, 11రోజుల నిరాహార దీక్ష ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ స్థానంలో నిలి పిన నాయకుడు కేసీఆర్‌ అన్నారు. అబద్ధాలు చెప్పి అధికారం లోకి వచ్చారని, రూ.4వేల పింఛన్లు, రైతుబంధు, మహిళలకు 2500, కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏమైందని ఆయా వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు. కేసీఆర్‌ రూ.200పింఛన్‌ను రూ.2016కు పెంచారని, రైతుబంధు ఇచ్చా రని, ఇతరత్రా అనేక పథకాలను అమలు చేశారని, ఈ ప్రభు త్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలి యజేయాలన్నారు. అందరి లక్ష్యం కేసీఆర్‌ను సీఎం చేయడ మే, తెలంగాణ అస్థిత్వం కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రఘువీర్‌సింగ్‌, గంట రాము లు, గోపు అయిలయ్య యాదవ్‌, ముల విజయారెడ్డి, దాసరి ఉష, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:15 AM