Share News

పెట్రోల్‌ బంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:51 AM

ప్రతీ పెట్రోల్‌ బంక్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. సోమవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని ఓ కల్యాణమండపంలో జిల్లాలోని పెట్రోల్‌ బంకుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

పెట్రోల్‌ బంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల క్రైం, ఫిబ్రవరి 12: ప్రతీ పెట్రోల్‌ బంక్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. సోమవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని ఓ కల్యాణమండపంలో జిల్లాలోని పెట్రోల్‌ బంకుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పెట్రోలియం యాక్ట్‌ 2002 ప్రకారం ప్లాస్టిక్‌ బాటిళ్లు, క్యాన్‌లలో పెట్రోల్‌ పోయవద్దన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత ఎస్‌హెచ్‌వోలు ప్రతీ పెట్రోల్‌ బంక్‌ను మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేస్తారన్నారు. ప్రతీ ఒక్కరు హెల్మెట్‌ ధరించారనే నిబంధనలను కఠినతరం చేయడానికి నో హెల్మెట్‌ నో పెట్రోల్‌ అనే నినాదంతో పోలీస్‌శాఖ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. హెల్మెట్‌ ధరించని వాహనదారుడికి పెట్రోల్‌ పోయవద్దని సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు ఉదయ్‌రెడ్డి, నాగేంద్రచారి, టౌన్‌ సీఐ రఘుపతి పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:51 AM