Janagama: రాములో.. రాములా.. ఆ ఊరిలో ఒకే పేరుతో..
ABN , Publish Date - Nov 09 , 2024 | 01:44 PM
అది జనగామ జిల్లా లింగాలఘణపురం(Lingalaghanapuram) మండలంలోని జీడికల్ గ్రామం. త్రేతాయుగం నుంచే శ్రీరామచంద్రస్వామి కొలువుదీరిన ఆల యం ఇక్కడే ఉండటంతో అందరూ ఆ శ్రీరామచంద్రుడుని తమ ఇలవే ల్పుగా కొలుస్తారు.
- ఆ ఊరిలో ఒకే పేరుతో సుమారు 200 మంది
లింగాలఘణపురం(జనగామ): అది జనగామ జిల్లా లింగాలఘణపురం(Lingalaghanapuram) మండలంలోని జీడికల్ గ్రామం. త్రేతాయుగం నుంచే శ్రీరామచంద్రస్వామి కొలువుదీరిన ఆలయం ఇక్కడే ఉండటంతో అందరూ ఆ శ్రీరామచంద్రుడుని తమ ఇలవే ల్పుగా కొలుస్తారు. అంతేకాదు తమ సంతానానికి ఆ రామచంద్రుడి పేరు కలిసొచ్చేలా రాములు అని పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 200మందికి పైగా రాములు అనే పేరున్నవారు అంటే ఔరా అనక తప్పదు.
ఈ వార్తను కూడా చదవండి: Kothagudem: ‘జపాన్’ లీడర్‌షిప్ శిక్షణకు స్వప్న..
ఇక ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే వాళ్ల పేర్లు పెద్ద రాము లు.. నడిపి రాములు.. చిన్న రాములు.. అని పెట్టుకున్న వారున్నారు. ఇంకా తండ్రీకొడుకుల పేర్లు రాములు అని ఉన్నవారు కూడా ఉండగా.. వారిని తండ్రి రాములు, కొడుకు రాములుగా సంబోధిస్తారు. అంతే కాదు బండమీది రాములు, బస్టాండ్ కాడి రాములు, హోటల్ రాములు అంటూ వారు వృత్తులు, నివసించే ప్రాంతాలను జోడించి పిలుచుకుం టారు. ఇక పోస్టాఫీస్‌కు రాములు అనే పేరుతో ఏదైనా ఉత్తరం వస్తే ఎవరికి ఇవ్వాలో అర్థం కాక పోస్ట్‌మాస్టర్ పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
అయితే ఇప్పుటి ఫ్యాషన్ ప్రపంచంలో పిల్లలకు తల్లిదండ్రులు రాములు అనే పేరునే కాకుండా ర అక్షరం కలిసొచ్చేలా కొత్తకొత్త పేర్లను పెట్టుకుంటున్నారు. ఇక ఇదే మండలంలోని పటేల్‌గూడెం గ్రామంలోనూ ఇదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ గోపాలస్వామి ఆలయం ఉండటంతో గ్రామస్థులు చాలామంది గోపాలస్వామిని ఇలవేల్పుగా కొలుస్తూ.. తమ సంతానం పేర్లను గోపాల్, గోపయ్య, గోపి, గోపాల స్వామిగా పెట్టుకోవడం గమనార్హం.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్ రీయింబర్స్‌మెంట్.. ఆన్‌లైన్‌లోనే!
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన
ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే
Read Latest Telangana News and National News