Share News

జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం : సీపీఎం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:17 AM

జమిలి ఎన్నికలు నిర్వహించేం దుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి విమర్శించారు.

జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం : సీపీఎం
చిట్యాల: సీపీఎంలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న నాయకులు

చిట్యాలరూరల్‌, అక్టోబరు 1: జమిలి ఎన్నికలు నిర్వహించేం దుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి విమర్శించారు. మండలంలోని వెలిమినేడులో మంగళవారం జరిగిన పార్టీ గ్రామశాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిం చాలనే యోచన రాష్ట్రాల్లోని ప్రభుత్వాల హక్కులను హరించడమే నన్నారు. జమిలీ ఎన్నికలకు సీపీఎం వ్యతిరేకమని, ఆయా రాష్ట్రాల హక్కులకు గౌరవించడం కేంద్రానికున్న బాధ్యత అని అన్నారు. సీపీఎం సీనియర్‌ నాయకుడు బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల రుణాలు మాఫీ కాకున్నా కూడా తాము రుణ మాఫీ చేశామని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించారు. నెలికంటి నర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, మల్లం మహేష్‌, జిట్ట సరోజ, అరూరి శ్రీను, కత్తుల లింగస్వామి, దేశబోయిన సరస్వతి, అరూరి శంభయ్య, సుర్కంటి బుచ్చిరెడ్డి, మామిడి రాములు పాల్గొన్నారు.

కేతేపల్లి: దేశంలో పేదరికం, నిరుద్యోగ సమస్యల నిర్మూలనకు కమ్యూనిస్టు విధానాలే ప్రత్యామ్నాయాలని సీపీఎం సీనియర్‌ నాయకుడు బోళ్ళ నర్సింహ్మారెడ్డి అన్నారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో మంగళవారం జరిగిన పార్టీ గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ చినవెంకులు, మండల కార్యదర్శి సీహెచ్‌.లూర్దుమారయ్య, నాయకులు బోళ్ళ జానకమ్మ, ఎల్‌. రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:17 AM