రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:29 PM
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
బెజ్జంకి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. మండలంలోని రేగులపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో పీడీ జయదేవ్ ఆర్య, డీఎ్‌సవో తనుజతో కలిసి గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యం తరలింపు, ట్యాబ్ ఎంట్రీ, ఏర్పాటు చేసిన వసతులను ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివా్‌సరెడ్డి, మార్కెటింగ్ డీఎం ప్రవీణ్, ఎంపీడీవో ప్రవీణ్, ఎంపీవో మంజుల, సూపరింటెండెంట్ అంజయ్య, ఐకేపీ సీసీ సారయ్య, ఏఈవో తేజస్వి, వివోఏ నాగలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.