Share News

ప్రతీ ఎకరాకు సాగునీరు

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:01 AM

ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

ప్రతీ ఎకరాకు సాగునీరు
సాగర్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చంద్ర సాగర్‌ను నుంచి ఇరిగేషన్‌ శాఖ అధికా రులతో కలిసి నీటిని విడుదల చేశారు. నీటిలో పూలుచల్లి ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చంద్రసాగర్‌ ఆయకట్టు కింద 1200 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇప్పుడు మరో 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు. చంద్రసాగర్‌ కాలు వల మరమ్మల కోసం ప్రతిపాదనలు పంపి నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ డీఈ బాలస్వామి, ఏఈ రమేష్‌, ఇరిగేషన్‌ శా ఖ అధికారులు, విజయ డెయిరీ చైర్మన్‌ నర్స య్య యాదవ్‌, నాయకులు మాజీ ఎంపీపీ రామనాథం, మంత్రియా నాయక్‌, కాశన్న యాదవ్‌, అభి, నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను శంకుస్థాపన

బల్మూరు : ప్రతీ గ్రామీణ ప్రాంతంలో ప్రజ ల అవసరాలను తెలుసుకుని వాటిని తీర్చడా నికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తుమ్మన్‌పేట గ్రామంలో రూ.8లక్షలతో నిర్మించనున్న అంగ న్‌వాడీ భవనం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా రూ.20లక్షలతో చేపట్టనున్న గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్‌రెడ్డి వెంకటరెడ్డి, నాయకులు గిరివర్ధన్‌ గౌడ్‌, నర్సింగరావు, హాకీయానాయక్‌, బిచ్చనా యక్‌, సుధాకర్‌గౌడ్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో రాఘవులు, సీడీపీవో దమయంతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:01 AM