TS News: మెడికో రచనా రెడ్డి ఆత్మహత్యకు కారణమేంటంటే..
ABN , Publish Date - Feb 13 , 2024 | 01:34 PM
మెడికో రచనా రెడ్డి మృతి కేసు విచారణ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. నిశ్చితార్థం జరిగిన యువకుడితో రచనకు మనస్పర్థలున్నాయని తెలిసింది. దీంతో కొద్ది రోజులుగా రచన డిప్రెషన్‌లో ఉంటోంది.
సంగారెడ్డి: మెడికో రచనా రెడ్డి మృతి కేసు విచారణ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. నిశ్చితార్థం జరిగిన యువకుడితో రచనకు మనస్పర్థలున్నాయని తెలిసింది. దీంతో కొద్ది రోజులుగా రచన డిప్రెషన్‌లో ఉంటోంది. ఈ కారణంగానే ఆమె బలవనర్మణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఓఆర్ఆర్ పక్కనే కారు ఆపి రచన ఆత్మహత్యకు పాల్పడింది. పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రిలో రచన మృతదేహం ఉంది. ఆమె మృతిపై ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదని సమాచారం.
నిన్న అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై కారులో రచన అపస్మారక సిత్థిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రచనా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని రచన ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. రచనా రెడ్డి ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో పీజీ చేసింది. ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటన్ షిప్ చేస్తోంది.