Harish rao: రాష్ట్రంలో సమస్యలు లేవా.. సీఎం, మంత్రులపై హరీష్ ఫైర్
ABN , Publish Date - Nov 09 , 2024 | 01:25 PM
Telangana: పాలనను వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు పక్క రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగవన్నారు. బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పట్టించుకోవడం లేదని విమర్శించారు.
హైదరాబాద్, నవంబర్ 9: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (Former minister Hairsh Rao) మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం, మంత్రుల రాష్ట్రాల పర్యటనలపై పలు వ్యాఖ్యలు చేశారు. పాలనను గాలికొదిలేసి పక్కరాష్ట్రాలకు వెళ్తున్నారంటూ మండిపడ్డారు. అలాగే మంత్రులు వారి సొంత శాఖలపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని కామెంట్స్ చేశారు. మంత్రులు ఉత్తమ్, భట్టి విక్రమార్క, సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని సమస్యలను గాలికి వదిలేసి వేరే రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా సీఎం, మంత్రులపై ఫైర్ అయ్యారు హరీష్ రావు.
AP Govt: నామినేటెడ్ పదవుల రెండో జాబితా రిలీజ్
హరీష్ ట్వీట్
పాలనను వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు పక్క రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగవన్నారు. బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రి సీతక్క జిల్లాలోనే మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనికరించరని వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగి గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడరన్నారు.
రాష్ట్రంలో ఇన్ని సమస్యలు అంటే.. ఇవేవీ పట్టనట్లు, రాష్ట్ర ప్రజలకు సమస్యలే లేనట్లు.. ముఖ్యమంత్రి సహా మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి పయనమయ్యారని దుయ్యబట్టారు. పాలన గాలికి వదిలి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేరళకు మంత్రి సీతక్క, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూ కట్టిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని బయల్దేరిన ముఖ్యమంత్రి, మంత్రుల్లారా.. మీరు చెప్పిన మార్పు అంటే ఇదేనా అంటూ హరీష్ రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
ముంబైకి రేవంత్...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సీఎం ముంబైకి చేరుకున్నారు. ఈరోజు ముంబైలో ప్రచారం చేయనున్నారు. ముంబై నగరంలో తెలుగు ప్రజలు ఉండే నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ముంబై చేరుకున్న సీఎంతో మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు, ఏఐసీసీ జాతీయ మీడియా కమిటీ ఛైర్మన్ పవన్ ఖేరా, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.
ఇవి కూడా చదవండి..
Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లు
Read Latest Telangana News And Telugu News