BRS: గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్
ABN , Publish Date - Feb 13 , 2024 | 10:17 AM
Telangana: గ్రేటర్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి దంపతులు కలిశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13: గ్రేటర్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి (BRS) మరో బిగ్ షాక్ తగిలింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి దంపతులు (DePuty Mayor Srilata Shobhan Reddy couple) కలిశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతె శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న శోభన్‌రెడ్డి హస్తం గూటికి చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు ముఖ్యమంత్రితో డిప్యూటీ మేయర్ దంపతులు భేటీ అయ్యారు. మరో రెండు రోజుల్లో శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఉద్యమకారులను కేసీఆర్, కేటీఆర్ అవమానపరుస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...