Share News

మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:20 PM

మైనార్టీల సంక్షేమాన్ని ప్ర భుత్వాలు పూర్తిగా విస్మరించాయని మిల్లి మహాజ్‌ మహబూబ్‌నగర్‌ మిల్లి మహజ్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ ఖాజాఫయాజుద్దీన్‌ అన్వర్‌పాషా అన్నారు.

మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
మాట్లాడుతున్న మిల్లి మహజ్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ ఖాజాఫయాజుద్దీన్‌

- ఈ నెల 17న డిమాండ్‌ డేగా జరుపుకోవాలి

- మిల్లి మహజ్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ ఖాజాఫయాజుద్దీన్‌

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 15 : మైనార్టీల సంక్షేమాన్ని ప్ర భుత్వాలు పూర్తిగా విస్మరించాయని మిల్లి మహాజ్‌ మహబూబ్‌నగర్‌ మిల్లి మహజ్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ ఖాజాఫయాజుద్దీన్‌ అన్వర్‌పాషా అన్నారు. జిల్లా ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 17 సెప్టెంబరును మత రాజకీయాలు చేస్తున్నారని, హైదరాబాద్‌ను ఏడో నిజాం భారత ప్రభుత్వంలో విలీనం చేశారని తెలిపారు. గత 76 ఏళ్లుగా రాష్ట్రంలో మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ప్రస్తుతం కాం గ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావటం మైనార్టీలు కృషి చేశారన్నారు. ముస్లిం లు ఈ నెల 17న డిమాండ్‌ డేగా జరుపుకోవాలని కోరారు. ముస్లిం 8 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ముస్లిం మైనార్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 17న మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేయ నున్నట్లు తెలిపారు. సమావేశంలో కన్వీనర్‌ తఖీహుస్సేన్‌, కో కన్వీనర్లు హఫీజ్‌ఇద్రీస్‌, ఖుద్దుస్‌బేగ్‌, ప్రతినిధులు అహ్మద్‌సనా, అబ్దుల్లా, నూరుల్లా, అబిద్‌, అబ్దుల్‌సమీ, ఉస్మాన్‌, సిరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:20 PM