ట్రాక్టర్ దూసుకెళ్లి రైతు మృతి
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:48 AM
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో ఓ రైతు మృతి చెందాడు.
ట్రాక్టర్ దూసుకెళ్లి రైతు మృతి
మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఘటన
తిప్పర్తి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో ఓ రైతు మృతి చెందాడు. బుధవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని రాయినిగూడెం గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. తిప్పర్తి ఎస్‌ఐ బి.సాయిప్రశాంత, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రాయినిగూడెం గ్రామానికి చెందిన మేడిశెట్టి జనార్ధన (46) తనకున్న నా లుగు ఎకరాల్లో వరి సాగుచేశాడు. బుధవారం మధ్యాహ్నం భార్య లక్ష్మమ్మ తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. వరికోత యంత్రంతో పంటను కోయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ట్రాక్టర్ కిందికి దిగి చూడగా లైట్లకు సంబంధించిన వైర్లు ఊడిపోయి ఉండటాన్ని గమనించి వాటిని కలిపేందుకు ఇం జన కిందకు వెళ్లాడు. వైర్లను కలపడంతో ట్రాక్టర్ ఇంజన స్టార్ట్ కాగా, అప్పటికే వాహనం గేర్‌లో ఉండటంతో ముందుకు కదిలి రైతు పైనుంచి ఇంజనతో పాటు ట్రాలీ కూడా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జనార్ధనకు కాలు విరగడంతో పాటు ఛాతీకి, తలకు బలమైన గాయాలయ్యాయి. సం ఘట నా స్థలంలోనే ఉన్న భార్య విలపిస్తూ బంధువులకు, 108 వాహనానికి ఫో న చేయడంతో వారు వచ్చి చూసేలోగా జనార్ధన మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ట్లు ఎస్‌ఐ తెలిపారు. జనార్ధనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భా ర్య లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత తెలిపారు.