తాగునీటి సమస్యను పరిష్కరించాలి : రాజగోపాల్‌రెడ్డి
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:18 AM
నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రె డ్డి అన్నారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలి : రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, సె ప్టెంబరు 11: నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రె డ్డి అన్నారు. నియోజకవర్గ ప రిధిలోని మిషన భగీరథ గ్రిడ్ పనుల తీరు సంబంధిత అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు కేటాయించాలని సూచించారు. ఏ కాలమైనా నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చౌటుప్పల్ మునిసిపాలిటీ పరిధిలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి కేటాయింపులు జరగలేదన్నారు. సమస్య పరిష్కారానికి మోటార్ల కెపాసిటీ పెంచాల్సి ఉంటుందని అధికారులు ఎమ్మెల్యే దృ ష్టికి తేగా అందుకు ఆమోదం తెలుపుతూ అవసరమైన ప్రతిపాదనలను తయా రు చేసి పంపాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.