Share News

DISCOMS: హైటెన్షన్‌ చార్జీల హేతుబద్ధీకరణ

ABN , Publish Date - Sep 12 , 2024 | 04:22 AM

హైటెన్షన్‌(హెచ్‌టీ) చార్జీలను హేతుబద్ధీకరించాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న డిస్కమ్‌లు.. చార్జీల పెంపుపై దృష్టి సారించాయి.

DISCOMS: హైటెన్షన్‌ చార్జీల హేతుబద్ధీకరణ

  • 11 కేవీతో సమానంగా.. 33, 132 కేవీ చార్జీల సవరణ

  • నిర్ణయించిన డిస్కమ్‌లు

  • వారం రోజుల్లో ఏఆర్‌ఆర్‌ దాఖలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): హైటెన్షన్‌(హెచ్‌టీ) చార్జీలను హేతుబద్ధీకరించాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న డిస్కమ్‌లు.. చార్జీల పెంపుపై దృష్టి సారించాయి. ఈ మేరకు వారం రోజుల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్‌), టారిఫ్‌ ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)లో దాఖలు చేయనున్నాయి. ఈ పెంపు ప్రభావం గృహ వినియోగదారులకు వర్తించబోదని తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్‌టీ వినియోగదారులు 11కేవీ కేటగిరీలో యూనిట్‌కు రూ.7.65, 33కేవీ కేటగిరీలో యూనిట్‌కు రూ.7.15, 123కేవీ వర్గంలో రూ.6.65 చొప్పున చెల్లిస్తున్నారు.


ఇప్పుడు డిస్కమ్‌లు 33కేవీకి సమానంగా మిగతా రెండు కేటగిరీలకు కూడా యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. డిమాండ్‌ లేని సమయంలో విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించేలా వెసులుబాటు కల్పిస్తున్న ‘టైమ్‌ ఆఫ్‌ డే టారి్‌ఫ’లోనూ హేతుబద్దీకరణతో మార్పులు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ప్రస్తుతం 42 రకాల హెచ్‌టీ వినియోగదారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిజానికి డిస్కమ్‌లు గడిచిన పదేళ్లలో రూ.64,227 కోట్ల మేర నష్టాలను మూటగట్టుకున్నాయి. నెలకు సగటున రూ.1000 కోట్ల మేర లోటును ఎదుర్కొంటున్నాయి. గత ప్రభుత్వం సర్దుబాటు చెల్లింపుల హామీని నిలుపుకోలేదని తెలుస్తోంది. హెచ్‌టీ టా రిఫ్‌ హేతుబద్ధీకరణతో నష్టాల నుంచి తాత్కాలిక ఊరట లభిస్తుందని డిస్కమ్‌లు భావిస్తున్నాయి.

Updated Date - Sep 12 , 2024 | 04:22 AM