మాంసానికి మస్తు గిరాకీ
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:31 PM
కొనుగోలుదారులతో మంగళవారం మాంసం దుకాణాలు కిటకిటలాడాయి.
మర్పల్లి, అక్టోబరు 1: కొనుగోలుదారులతో మంగళవారం మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. నేడు పెత్తర అమావాస్య సందర్భంగా ఒకరోజు ముందుగానే మాంసాన్ని కొనుగోలు చేశారు. కాగా, నేడు గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ప్రజలు ఒక రోజు ముందే మాంసాన్ని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.